కుంకుడుకాయలు వాడితే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా ఈ స‌మ‌స్య‌లు దూరం

Do you know the benefits of using Soapberries

0
87

జుట్టు శుభ్రం చేసేందుకు త‌లంటు స్నానం చేసే స‌మ‌యంలో మ‌న పెద్ద‌లు పూర్వీకులు కుంకుడుకాయ శీకాయ వాడేవారు. కాని ఇప్పుడు చాలా రేర్ గా వీటిని వాడుతున్నారు. అంద‌రూ షాంపూల‌కు అల‌వాటు ప‌డ్డారు. తెల్ల‌వారు జామున కుంకుడు కాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారుచేసి తలస్నానం కోసం ఉపయోగించేవారు.

కుంకుడుకాయలోని సెపోనిన్ వలన నురుగ తయారై తలపై ఉన్న మలినాలు తొలగిపోయి వెంట్రుక‌లు బాగుంటాయి. అందుకే ఆ రోజుల్లో చుండ్రు స‌మ‌స్య‌లు ఉండేవి కావు. ఎందుకంటే కుంకుడుకాయ‌ల్లో ఈ రసం సూక్ష్మక్రిమి సంహారిణిగా పనిచేస్తుంది.

తలలో కురుపులు, చుండ్రు మొదలైన చర్మ సమస్యలు ఉంటే ఈ కుంకుడుకాయ రసం పోగొడుతుంది.
కుంకుడుకాయ‌లు వాడ‌టం వ‌ల్ల‌ చర్మానికి ఏర్పడే దురదలను ఎలర్జీలను త‌గ్గించుకోవ‌చ్చు.
ఇక షాంపూలో అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం లారీల్ సల్ఫేట్ , గ్లైకాల్ , సోడియం లారీల్ సల్ఫేట్ ,
సిట్రిక్ ఆసిడ్ వంటి అనేక రసాయనాలు మిక్స్ చేసి త‌యారు చేస్తారు. కుంకుడుకాయ‌లు వాడ‌టం వ‌ల్ల ఈ పొల్యుష‌న్ వ‌ల్ల వ‌స్తున్న చుండ్రుకి చెక్ పెట్ట‌వ‌చ్చు అంటున్నారు నిపుణులు.