మామూలుగా మనం ఇళ్లల్లో పెంపుడు జంతువులుగా కుక్కులు, పిల్లుల్ని పెంచుకుంటాం. వాటితో మనం సరదాగా ఆడుకుంటాం. అయితే అక్కడి వరకు అంతా బాగున్నా వాటిపై చూపించే ప్రేమకూడా ఒక్కోసారి మనకు ప్రమాదకరంగా మారుతుంది. అదెలా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
మనం పిల్లితో సరదాగా ఆడుకుంటాం. ముద్దు పెడతాం. కానీ అనుకోకుండా పిల్లి కరిస్తే మాత్రం డేంజర్. పిల్లికి ఉండే పదునైన దంతాలు..చర్మంలోకి చొచ్చుకుపోయి ఇన్ఫెక్షన్ కు దారితీస్తాయి. ఇంకా కుక్క లాలాజలం లాగే..పిల్లి లాలాజలం కూడా చాలా ప్రమాదకరం. ఇది ఎన్నో బాక్టీరియాలుకు నిలయం. పిల్లి కరిస్తే..బాక్టీరియా సోకే ప్రమాదం కచ్చితంగా ఉంది. పిల్లి కరిస్తే వెంటనే వైద్యుడి వద్దకు లేదా సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. ఒకవేళ ఆసుపత్రికి చేరుకోవడం సాధ్యం కాకపోతే ఇంట్లో ప్రథమ చికిత్స అయినా చేసుకోవాల్సిందే..మనకు కుక్కకరిస్తే త్వరగా రెస్పాండ్ అయి..ట్రీట్మెంట్ చేసుకోవడం తెలుసు కానీ..పిల్లి కరిస్తే ఎవరు అంత డేంజర్ అని ఫీల్ అవ్వరు.
కానీ పిల్లకాటు కూడా ప్రమాదమే.. గాయాన్ని సబ్బు నీటితో కడగాలి. తద్వారా బ్యాక్టీరియా కొంతవరకు నశిస్తుంది. కుక్క కాటులా పిల్లి కాటు కూడా రేబిస్‌కు కారణం అవుతుంది. దీన్ని నివారించడానికి రేబిస్ ఇంజెక్ట్ చేసుకోవడం మరిచిపోవద్దు. డాక్టర్ చెబితే టెటానస్ ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. టెటానస్ అనే బ్యాక్టీరియా మానవ శరీరానికి చాలా ప్రమాదకరం. పెంపుడు జంతువులని ఎంతవరకు ముద్దాడాలో అంతవరకే..కొంతమంది అది జంతువన్న సంగతి మరిచే..ఓ దానికి ముద్దులుపెట్టేస్తారు. పెట్టించుకుంటారు.. ప్రేమ ఉండొచ్చు..కానీ అది మనకు హాని కలగించేది అయితే ఎలా.? ఆస్తమా ఉన్నవారు పెంపుడు జంతువులకి దూరంగా ఉంటే మంచిది. లేదంటే శ్వాసకోశ సమస్యలు ఇంకా వేధిస్తాయి. అంతేకాకుండా పెంపుడు జంతువులకు టీకాలు తప్పక వేయించాలి. లేదంటే అవి వ్యాధి బారిన పడుతాయి.
తద్వారా మనం కూడా వ్యాధికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏదో పెంచామంటే..పెంచామని కాదు..వాటికి మనం తినే ఫుడ్ పెట్టేస్తుంటారు..కానీ కుక్కలకు కొన్ని పెట్టుకూడని ఐటమ్స్ ఉంటాయి..అవి అస్సలు ఇవ్వకూడదు..ప్రతి వారం కుక్కలకు, పిల్లులకు నీట్ గా స్నానం చేయించాలి. గోల్లు కత్తిరించాలి. కుక్కలను సోఫాలమీదకు, బెడ్ మీదకు కూడా ఎక్కించుకుంటారు.. అది అంత మంచి పద్ధతి కాదు..వాటిలో ఉండే కంటికి కనిపించని బాక్టీరియా మనం వాడే వస్తువులకు అంటుకుంటుంది. కుక్కలైనా, పిల్లులైనా సరే..సరైన జాగ్రత్తలు తీసుకోకూండా పెంచితే మాత్రం ప్రమాదమే..!