క్యాప్సికమ్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

Do you know the health benefits of eating capsicum?

0
45

కొంతమందికి కొన్ని కూరగాయలు అస్సలు నచ్చవు. ఇలాంటి కూరగాయల వంటలు తినడానికి ఇంట్రస్ట్ చూపించరు.
చాలా మంది క్యాప్సికమ్ కూరగాయను తినడానికి ఇష్టపడరు. దీనిని తినే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయితే మీకు తెలుసా ఈ క్యాప్సికమ్ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాప్సికమ్ను బెల్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. క్యాప్సికమ్ను ఎక్కువగా సలాడ్లలో, ఫాస్ట్ ఫుడ్, ఇతర వంటలలో వాడతారు.

మరి క్యాప్సికమ్లో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది చూద్దాం. క్యాప్సికమ్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా రకాల క్యాన్సర్ ప్రమాదాలని తగ్గిస్తాయి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. డయేరియా, అల్సర్ సమస్యలను తగ్గిస్తుంది.

అంతేకాదు క్యాప్సికమ్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఇక యంగ్ లుక్ అనేది ఇస్తుంది. చర్మ సమస్యలు కూడా తగ్గిస్తుంది. పోని వారానికి కుదరకపోయినా నెలకి ఓ రెండు సార్లు తీసుకునేలా ప్రయత్నం చేయండి అంటున్నారు వైద్యులు.