కరక్కాయ ఎన్నో ఔషదాలకు దీనిని వాడతారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో పేరు ఉంది. ఇప్పటికీ ఎవరికి అయినా దగ్గు వచ్చినా ,గొంతు నొప్పి అనిపించినా ఆ కరక్కాయ ముక్క బుగ్గ కింద పెట్టి చప్పరించమంటారు. ఆరసం మన గొంతులో ఉన్న కఫాన్ని పొగొడుతుంది అని పెద్దలు చెబుతారు. ఇలా అనేక చిన్న చిన్న వ్యాధులకి ఇది చెక్ పెడుతుంది.
ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కరక్కాయ తలకు చాలా మంచిది. తలకు తయారు చేసే మందుల్లో ఈ కరక్కాయని ఎక్కువగా వాడతారు.కరక్కాయ విత్తనాల నుండి తీసిన నూనె
పలు మందుల తయారీకి కూడా వాడతారు.
ఈ కరక్కాయ వల్ల మీకు గొంతు నొప్పి కఫం దగ్గు సమస్య ఉంటే తగ్గుతాయి. కరక్కాయ పౌడర్ను నీటితో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల యాంటీఆక్సిడెంట్ పెరుగుదల ఉంటుంది. మీకు మంచి ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. ఇక కొబ్బరి నూనె కరక్కాయ పొడి కాళ్లకు రాస్తే మొకాళ్ల నొప్పుల సమస్య తగ్గుతుంది.