ఉసిరిచాలా మంది తినడానికి ఆసక్తి చూపిస్తారు దాని రుచి బాగుంటుంది. అయితే ఉసిరి పచ్చడి, ఎండిన ఉసిరి ముక్కలు అలాగే ఊరబెట్టిన ఉసిరికాయలు ఇలా చాలా మంది రకరకాలుగా తీసుకుంటారు. ఉసిరి హల్వా అలాగే ఉసిరి పులిహోర కూడా చాలా మంది చేసుకుంటారు. అయితే ఇది మంచి ఔషదగుణాలు కలిగిన కాయ. ఆయుర్వేద వైద్యంలో ఉసిరికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ శక్తి ఎక్కువగా ఉంది.
పెద్దలు చెబుతారు తొలి ముద్ద ఉసిరిపచ్చడితో తింటే జీర్ణం బాగా అవుతుంది అని. శీతాకాలంలో ఉసిరి చాలా మంది తీసుకుంటారు. ఉసిరిని ఎండబెట్టి తింటే కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మీరు ఎండిన ఉసిరి ముక్కలు తీసుకోవచ్చు అలాగే పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఉసిరిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. సీజనల్ వ్యాధులైన జలుబు, గొంతునొప్పితో ఎవరైనా తరచూ ఇబ్బంది పడితే వారు ఉసిరి తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది అందుకే మలబద్దకం తగ్గిస్తుంది. కొందరికి నోటి పూత వేధిస్తుంది వేడి చేసినా నోటి పూత వస్తూ ఉంటుంది. వారు ఈ ఎండబెట్టిన ఉసిరి తీసుకుని వాటర్ లో కలిపి ఆ నీరు పుక్కలించినా మీకు నోటి పూత తగ్గుతుంది. ఈ ఉసిరి కఫ దోషాలను తగ్గిస్తుంది.