తెల్ల మిరియాల వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా

Do you know the health benefits of white pepper?

0
85

మనం మిరియాలు వాడుతూ ఉంటాం, మనకు ఎక్కువగా నల్ల మిరియాలు మాత్రమే తెలుసు.
ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటితోపాటు తెల్ల మిరియాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ తెల్ల మిరియాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.తలనొప్పిని తగ్గించడంతోపాటు, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తెల్ల మిరియాలు ఎంతో సహాయపడతాయి.

తెల్ల మిరియాలలో క్యాప్సైసిన్ ఉంటుంది ఇవి ఎక్కువగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఇవి తీసుకుంటే తిమ్మిరి ఇబ్బందులు తగ్గుతాయి. ఈ మిరియాలు కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక ఊబకాయం సమస్య తగ్గుతుంది.
క్యాన్సర్ ను తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాదు తెల్ల మిరియాలు ప్రోస్టేట్ క్యాన్సర్ ను నయం చేయడంలో సాయం చేస్తాయి.

ఇక వీటిని తరచూ తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. కఫం తగ్గుతుంది. అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించడంలో వైట్ పెప్పర్ సహాయపడుతాయి. రక్తపోటును తగ్గించడంలో సాయం చేస్తాయి. అంతేకాదు తెల్లమిరియాల్లో విటమిన్ సీ, ఏ పుష్కలంగా ఉంటాయి. ఇక పెద్ద పెద్ద హోటల్స్ లో సలాడ్స్ లో, సూప్స్ లలో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు.