హిందూ సాంప్రదాయంలో మహిళలు గాజులు ధరించడం తెలిసిందే. మహిళలు కచ్చితంగా గాజులు ధరిస్తారు. ఇక వివాహం అయిన తర్వాత ఆ మహిళలు అస్సలు గాజులు తీయరు. ఫంక్షన్లకు పూజలకు కొత్త గాజులు ధరిస్తారు. భర్త గాజులు కొని ఇస్తే ఎంతో సంతోషిస్తారు కూడా. అయితే మన దేశంలో చాలా చోట్ల గాజులని వాడతారు. ఇక గాజులు వేసుకోవడానికి కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు ఒక్కోప్రాంతంలో. మరి ఇంతకీ వారు చెప్పేది ఏమిటి అనేది చూద్దామా.
1. మీరు చూడండి చిన్న పిల్లలకు నల్లగాజులు వేస్తారు దీని వల్ల వారికి నర దిష్టి తగలకుండా ఉంటుంది అని వెంటనే కొన్ని వారాలకి కొత్తవి వేస్తారు.
2. గాజు ,మట్టి గాజులు పగిలిపోకుండా చూసుకునే అమ్మాయిలు వివాహం అయిన తర్వాత భర్తతో ఎంతో ఆనందంగా కాపురం చేసుకుంటారట.
3. ఎక్కడైనా మట్టిగాజులు వేసుకోవడం ముత్తైదువుతనాన్ని సూచిస్తుంది.
4.మణికట్టు నుంచి, ముంచెయ్యివరకు కొందరు గాజులు ధరిస్తారు. దీని వల్ల వారికి మంచి సంతాన యోగం కలుగుతుంది అని నమ్మకం.
5. బెంగాల్ కోస్టల్ ఏరియాలో గవ్వలతో చేసిన గాజులు ధరిస్తారు. దీని వల్ల తమ భర్త ఆరోగ్యంగా ఉంటాడు అని వారి నమ్మకం.
6. గిరిజన స్త్రీలు ఇప్పటికీ చెక్క గాజులు ధరిస్తారు. వారి సంప్రదాయం పాటిస్తుంటారు.
7. యూపీలో పెళ్లికూతురికి పుట్టింటి వారు ఎంత కట్నాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, వివాహానికి ముందు కచ్చితంగా అత్తవారి ఇంటి నుంచి ఎర్రటి గాజులు ఎర్రటి చీర ఇస్తారు అక్కడ సంప్రదాయం.