చికెన్ రోల్ చాలా మంది ఇష్టంగా తింటారు. కొందరు రెండు మూడు చికెన్ రోల్స్ కూడా తింటారు. అయితే మీరు ఎప్పుడైనా రెండు చేతులతో పట్టుకున్నా సరిపోని పెద్ద చికెన్ రోల్ చూశారా? మరి ఇది చూడాలి టేస్ట్ చేయాలి అంటే దిల్లీ వెళ్లాల్సిందే. ఢిల్లీలోని మోడల్ టౌన్లో ఉన్న పాట్నా రోల్ సెంటర్ దీన్ని తయారుచేశారు.
ఈ రోల్ రెండు అడుగుల పొడవు ఉంటుంది. ఓ ఫుడ్ బ్లాగర్ దీని గురించి తెలియచేశాడు. ఇది చూడటానికి చాలా మందికి నోరు ఊరుతుంది. కాని ఒకరు మాత్రం ఇంత పెద్ద రోల్ తినలేరు అంటున్నారు.ఈ రోల్ని తయారు చేయడానికి పది గుడ్లను ఉపయోగించారట.
చపాతీని అప్పటికప్పుడు తయారుచేసి కాలుస్తారు. తరువాత దానిపై పది గుడ్లు, అందులో చికెన్ సీఖ్ రోల్, మటన్ సీఖ్ రోల్, నూడుల్స్ వేశారు. ఆ తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కూరగాయలు, మయోనైజ్, తందూరీ సాస్ వేసి రోల్ని చుడతారు.అల్యూమినియం ఫాయిల్ చుట్టి మన చేతికి ఇస్తారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందట. మరి దీని రేట్ ఎంత అంటే వెజ్ అయితే 400, నాన్ వెజ్ అయితే 600
అని చెబుతున్నారు.