ప్రపంచంలో అతి ఖరీదైన మామిడి పండ్లు ఏవో తెలుసా

Do you know what are the most expensive mangoes in the world?

0
190

మామిడి పండు అన్ని పండ్లలో ఇది రారాజు. ఇక దీని ధర కూడా సాధారణంగానే ఉంటుంది. కాని కొన్ని మామిడి పండ్లు మాత్రం చాలా ఖరీదుగా ఉంటాయి. అయితే జపాన్ లో ఉన్న మామిడి పండ్లు ప్రపంచంలో అత్యంత ఖరీదైన మామిడి పండ్లుగా రికార్డుల‌కెక్కాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండును మియాజాకీ మ్యాంగో అని పిలుస్తారు.

ఈ మామిడి పండు కిలో కొనాలంటే మన కరెన్సీలో రూ 2.70 లక్షల రూపాయలు ఇవ్వాలి. అప్పుడు కిలో ఇస్తారు ఇక్కడ కిలోకి మరో 100 గ్రాములు ఎక్కువ‌ ఉన్నా మళ్లీ వాటికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ మాంగో రుచిలో అంత బాగుంటాయి అందుకే గ్రాము ఎక్కువ ఉన్నా లెక్కవేసి డబ్బులు తీసుకుంటారు.

ఇవి చూసేందుకు బంగారు, ఎరుపు కలగలిసిన రంగులో కనిపిస్తాయి.ఈ మియాజాకీ మామిడి పండు కనీసం 350 గ్రాముల బరువు ఉంటుంది. ఇక చాలా దేశాల్లో ఈ అరుదైన మామిడి మొక్కలు పెంచుకుంటున్నారు. ఫలాలు ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. అయినా చాలా మంది ఈ మామిడి పండ్లు తమ తోటల్లో పెంచుకుంటారు.