ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో ఒత్తిడి కారణంగా రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోయే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది.అయితే మనిషి ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. కానీ 8 గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోతే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చేబుతున్నారు. ముఖ్యంగా ఉదయం 10 దాటినా నిద్రలేవనివారికి ఈ సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అవేంటో మీరు కూడా చూడండి..
అయితే రోజుకు 6-8 గంటలపాటు నిద్రపోయే వారితో పోలిస్తే.. 8 గంటల కంటే అధికంగా నిద్రపోయే వారిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వారంలో ఒక్కరోజు 8 గంటలు నిద్రిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ రోజు అదేపనిగా నిద్రపోతే మాత్రం గుండెకు సంబంధించిన రోగాల బారిన పడే ప్రమాదముందని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడయింది.
దీనివల్ల త్వరగా మరణించే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ సేపు నిద్రపోయేవారు అధిక బరువు, ఊబకాయం, అలసట వంటి సమస్యలను కూడా తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా అతిగా నిద్రపోయే వారే డిప్రెషన్, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలతో పాటు వృద్ధాప్య ఛాయలు కూడా వస్తాయట. అంతేకాకుండా మధ్యాహ్న సమయంలో పడుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి