చీపురు ఈ స్థలాలలో పెడితే ఏం జరుగుతుందో తెలుసా?

0
109

సాధారణంగా అందరి ఇళ్లల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి చీపురు వాడుతామని అందరికి తెలుసు. మనం ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ, ఎలా ఇంట్లో పెట్టాలో అనే విషయం తెలుయక చాలా మందికి పొరపాట్లు చేస్తుంటారు. అందుకే శాస్రం ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే మంచి ఫలితాలు పండొచ్చంటున్నారు శాస్త్రజ్ఞులు. అవేంటో మీరు కూడా చూడండి.

చీపురు ఇంటికి వచ్చిన అతిథులకు కనబడకుండా ఉండాలి. అందుకే తలుపు వెనక భాగంలో పెట్టుకొమ్మని మంచిదంటున్నారు శాస్త్రజ్ఞులు. ఉదయం నిద్రలేవగానే ఉత్తర దశ చూస్తే మంచి జరుగుతుందట. ఇల్లును ఊడ్చేటప్పుడ ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు ఉకి చెత్తను పోగు చేయండి.  ఈశాన్యం వైపు చెత్తను పోగు చేయడం వల్ల ఆ గృహంలో సంపద నిలకడగా ఉండకపోవడంతో పాటు ఆరోగ్య పరంగా కూడా సమస్యలు వస్తాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చీపురు పెట్టడానికి పశ్చిమం, నైరుతి దిశ మంచిదంటున్నారు. ఈ రెండు దిశలలో చీపురు ఉండటం వల్ల ప్రతికూల శక్తి బలహీనపడుతుంది. ఒకవేళ మీకు గనక  కలలో చీపురు కనబడితే  డబ్బు పొందుతారట. చీపురు మార్చుకోవాలంటే కేవలం శనివారము మాత్రమే మార్చాలని  నమ్ముతారు. చీపురును పాదాలకు తాకనీయకూడదు. అంతేకాకుండా వంటగదిలో కూడా చీపురు పెట్టుకోవద్దు.