సాధారణంగా పెద్దలు ఇంటికొక కరివేపాకు చెట్టును పెంచుకోవాలని సూచిస్తుంటారు. ఎందుకంటే కరివేపాకు చెట్టు కేవలం ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కగానే కాకుండా ఆదాయాన్ని పెంచే మొక్కగా కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కరివేపాకు చెట్టును పెంచుకోవడం వల్ల ఇంట్లో పాడి పంటలను సమృద్దిగా ఉంచుతుంది. ఇంకా కరివేపాకు చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..
ఇంట్లో ముఖ్యంగా కరివేపాకు చెట్టు, తులసి చెట్టు, కలబంద చెట్టు పెట్టుకోవడం వల్ల వివిధ రోగాల బారిన పడకుండా ఉంటాం. అంతేకాకుండా కరివేపాకు విష వాయువులను గ్రహించి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది. గాలి ద్వారా సోకే వ్యాధులను కూడా కరివేపాకు మన దరి చేరకుండా కాపాడుతుంది. అంతేకాకుండా కరివేపాకులో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.
కరివేపాకు ఆకుల రసాన్ని రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. మన శరీరం వైరస్, బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంచడంలో కూడా కరివేపాకు సహాయపడుతుంది. ఇంకా జుట్టు, ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది.