చల్లని నీటితో స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

0
93

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ మనకు తెలియక చేసే తప్పుల వల్ల కూడా అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి తెలియక కూల్‌ వాటర్‌తో స్నానం చేస్తుంటారు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. కానీ ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తాయి.

అవేంటంటే..చల్లని ఉష్ణోగ్రతలు గుండె, రక్తప్రసరణపై ముఖ్యమైన ప్రభావాలను చూపుతాయి. అందుకే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు చల్లని నీటితో స్నానం చేయకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ల్లని నీటితో స్నానం చేయటం వల్ల చర్మంలోని రక్తనాళాలు సంకోచించబడతాయి. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ వేగం తగ్గుతుంది.

దీని ఫలితంగా చల్లని నీరు శరీరానికి తగిలినప్పుడు ఒక్కసారిగా షాక్ తగిలిన భావన కలుగుతుంది. హార్ట్ బీట్‌లో కూడా అమాంతం తేడా వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా  శ్వాస ఆడకపోవడం కూడా జరుగుతుంది. అందుకే వీలయినంత వరకు చల్లని నీటితో స్నానం చేయకపోవడం మంచిది.