ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

0
108

ప్రస్తుత రోజుల్లో  ఏసీలో ఉండడం సర్వసాధారణం అయిపోయింది. అధిక మంది సాఫ్ట్ వేర్ జాబ్స్ వైపు మొగ్గుచూపడంతో..ఏసీలో ఉండే వారి సంఖ్య కూడా అధికం అవుతుంది. ఇలా రోజంతా ఏసీలో గడపడం వలన ప్రయోజనాల కంటే కూడా నష్టాలే ఎక్కువగా చేకూరే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

ఏసీలో ఎక్కవ సమయం ఉండడం వల్ల ముక్కు, గొంతు శ్వాసకోశ  సమస్యలు బారిన పడతారు. గదిలో చల్లదనం బయటికి పోకుండా ఉండేందుకు తలుపులు అన్నివేయడం వల్ల ఆక్సిజన్ తగ్గి మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్ వాయువు పెరిగిపోతుంది. దీనివల్ల తలనొప్పి సమస్య వేదించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏసీలో చాలా సేపు ఉన్నవారికి బాగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది.

ఏసీలో ఎక్కవ సమయం ఉండేవారికి పెద్దగా దాహం వేయదు . దీంతో రోజులో తాగాల్సిన నీళ్ల కంటే తక్కువ శాతం నీరు తాగడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. అందుకే ఎక్కువ సమయం ఏసీలో ఉండే వారు అప్పుడప్పుడూ సహజమైన గాలి కోసం బయటకు వస్తూ ఉండాలి. దీనివల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.