మనం చూస్తు ఉంటాం గంగానదిలో అస్థికలు కలపడానికి చాలా మంది వెళుతూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు చేస్తారు అంటే భీష్ముడు చెప్పిన మాట కూడా ఓ కథనం రూపంలో వినిపిస్తుంది అదేమిటో తెలుసుకుందాం. గంగాపుత్రుడవు భీష్ముడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడి అంపశయ్యమీద ఉంటాడు. ఈ సమయంలో ఆయన ఎన్నో నీతి విషయాలు చెబుతాడు. పాండవులు వాటిని వింటారు. ఈ సమయంలో ఆయన చెప్పిన ఓ విషయం ఏమిటి అంటే.
గంగా, యమునా, సరస్వతిలు కలిసిన సంగమంలో స్నానం చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. ఈ గంగా నది నీరు మన శరీరానికి కొంచెం తాకినా మన శరీరానికి ఎంతో మంచిది సకల పాపాలు తొలగిపోతాయి అని తెలిపారు. ఇక్కడ మనిషి ఎముకలు ఎన్ని సంవత్సరాలు గంగానదిలో ఉంటాయో అన్ని సంవత్సరాలు అతను స్వర్గంలో నివసించి పుణ్యం పొందుతాడు అని చెబుతారు. అందుకే అక్కడ వారి అస్తికలు కలుపుతారు.
ఎవరైనా వ్యక్తి గంగానదిలో స్నానం చేస్తే అతనికి వచ్చిన పుణ్యం అతనికే కాదు అతని ఏడు తరాల పెద్దలకు, వచ్చే తరాల వారికి కూడ పుణ్యం అని తెలిపారు. గంగానదిని తలుచుకుంటే ఏ భయం ఉన్నా పోతుంది. అంతేకాదు మీరు ఏ నదిలో స్నానం చేసినా గంగా గంగా గంగా అని మూడుసార్లు అంటే ఆ పుణ్య ఫలం దక్కుతుంది.