గుడ్డు పెంకులు పాడేస్తున్నారా వీటితో ఏం చేస్తారో తెలుసా?

Do you know what to do with egg shells

0
82

మనలో చాలా మంది గుడ్డు తీసుకుంటారు ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా గుడ్డు నుంచి అనేక పోషకాలు అందుతాయి శరీరానికి. రోజూ ఒక గుడ్డు తింటే శరీరానికి శక్తి వస్తుందని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే గుడ్డు తినే సమయంలో మనం ఆ గుడ్డుపైన ఉండే పెంకులు పడేస్తూ ఉంటాం. మీకు తెలుసా మనం పడేస్తున్న ఈ పెంకులలో అనేక లాభాలున్నాయి.

ఇవి కాల్షియం యొక్క గొప్ప మూలం. బోరాన్, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, ఇనుము, మాలిబ్డినం, సల్ఫర్, జింక్ మొదలైన ఇతర సూక్ష్మ మూలకాలను కూడా కలిగి ఉంటాయి. అయితే ప్రపంచం వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ గుడ్డు పెంకులు వినియోగిస్తున్నారు.

వీటిని పౌడర్ చేసి వీటిని ఫేస్ ప్యాక్ గా కూడా వాడుతున్నారు.
ఎగ్ షెల్ హెయిర్ ప్యాక్ కూడా చాలా మంది చేసుకుంటున్నారు.
గుడ్డు పెంకుల పొడితో కాల్షియం సప్లిమెంట్ గా కొన్ని కంపెనీలు తయారు చేస్తున్నాయి.
దంతాల రక్షణ కోసం కొన్ని దేశాల్లో చాలా మంది టూత్ పేస్ట్ గా కూడా వాడుతున్నారు.
మొక్కలు పెరగడానికి కాల్షియం అవసరం అందుకే గుడ్డు పెంకుల పొడిని ఉపయోగిస్తున్నారు.