పాలు ఎప్పుడెప్పుడు తాగాలో తెలుసా? వీళ్లు పాలు అస్సలు తాగకూడదు..

0
107

పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా ఇందులో వుండే మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్ డి, ఎ, ఇ మేలు చేస్తాయి. ఇవి ఎముకలు.. దంతాలు బలంగా ఉండేందుకు సహయపడతాయి. పిల్లల నుంచి వృద్దుల వరకు ప్రతిరోజు ఒక గ్లాసు పాలు కచ్చితంగా తీసుకోవాలి. కానీ ఆయుర్వేదం ప్రకారం శారీరక సమస్యలు ఉన్నవారు పాలను అస్సలు తీసుకోవద్దట.

పాలు ఎవరు తాగకూడదు.. దగ్గు, జలుబు, చర్మ సంబంధిత సమస్యలు, దురద, బరువు పెరగడం వంటి సమస్యలు ఉన్నవారు పాలను తాగకూడదు. చెవి, గొంతులో దురద సమస్య ఉన్నవారు కూడా పాలను తాగకూడదు. ఈ సమస్యలు ఉన్న వారు కేవలం రాత్రి వేళలో పాలను తీసుకోవచ్చు. పొడి దగ్గు ఉన్నప్పుడు తక్కువ మోతాదులో పాలను తీసుకోవాలి. కానీ అదే పనిగా దగ్గు సమస్య ఉంటే పాలను తాగకూడదు. రాత్రిళ్లు ఆలస్యంగా తినడం.. నిద్రపోయే ముందు పాలను తాగడం చాలా హానికరం. ఇది తలకు సంబంధించిన వ్యాధులకు దారి తీస్తుంది.

ఆకలిగా ఉన్నప్పుడు పాలను తాగడం మేలు. అయితే ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత పాలను తాగకూడదు. దీంతో పాలు సరిగ్గా జీర్ణం కావు. పాలు సరిగ్గా జీర్ణం కావు. అలాంటి సమయంలో జలుబు, దగ్గు, విరేచనాలు, వాంతులు, జ్వరంతోపాటు అజీర్తి సమస్యలు వస్తాయి.

పులుపు, లవణం కలిగిన వాటిని ఎప్పుడూ పాలతో కలిపి తీసుకోవద్దు. వేసవిలో మిల్క్ షేక్స్.. మామిడికాయ షేక్స్ తీసుకొవద్దు. మామిడి కాయను పాలతో కలిపి అస్సలు తీసుకోవద్దు. అదేవిధంగా పాలతో కలిపి స్ట్రాబెరీ షేక్ కూడా తీసుకోవద్దు. అలాగే పాలతో కలిపి సిట్రస్ పండ్లను తీసుకోవద్దు.