అరటిపండు అనేది చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా పేదవారి ఫలం అంటారు. రేటు తక్కువ అలాగే మంచి గుణాలు పోషకాలు కలిగి ఉంటుంది.ఈ పండు. దాదాపు ప్రతీ సీజన్లో దొరుకుతుంది. అయితే చాలా మందికి ఓ అనుమానం. అన్నీ పండ్లులా ఇది ఎందుకు నిలువుగా ఉండదు, ఎందుకు వంకరగా ఉంటుంది అని ఆలోచన ఉంటుంది.
ఇది పెరుగుతున్న సమయంలో చెట్టు పై అరటి పండు పుష్పగుచ్ఛాలతో ఉంటుంది. ఇది ఒక మొగ్గ లాంటిది. అందుకే ఈ అరటి గెల అని పిలుస్తాం. ఈ గెల పెరుగుతున్న సమయంలో అరటి నేల వైపు పెరుగుతుంది. తర్వాత నెగటివ్ జియోట్రోపిజం వల్ల వంకరగా మారుతాయి. ఇక మీకు ఇలా పెరిగే మరొకటి పొద్దుతిరుగుడు ఇది కూడా ఈ విధమైన మొక్క.
పొద్దుతిరుగుడు పువ్వు ఎల్లప్పుడూ సూర్యుని ఉదయించే దిశలో ఉంటుంది. సాయంత్రం సూర్యుడు తన దిశను మార్చుకున్నప్పుడు, పొద్దుతిరుగుడు పువ్వు కూడా దాని దిశను మార్చుకుంటుంది. అరటి అనేది మొదట బాగా వర్షాలు పడే ప్రాంతంలో అరణ్యాల్లో పెరిగేవి. అరటిపండు 4000 సంవత్సరాల క్రితం మలేషియాలో పెరిగింది అక్కడ నుంచి ప్రపంచానికి పరిచయం అయింది. అరటిపండు ప్రపంచం జనాభాలో 52 శాతం మంది ఉదయం 11 లోపు తింటారట.