పిల్లలకు నల్లతాడు ఎందుకు కడతారో తెలుసా?

Do you know why children's have Black thread

0
78

పుట్టిన పిల్లలకు చాలా మంది పెద్దలు ఇంట్లో రెండు కాళ్లకు నల్లతాడు కడతారు. అయితే దీనిని ఎందుకు కడతారు అంటే? దిష్టి తగలకుండా కడతారు అని చెబుతారు. కంటి చూపుకి శక్తి ఉంటుంది. కొంత మంది కంటి చూపు పడితే చెడు జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు చాలా సుకుమారంగా, కోమలంగా, అందంగా ఉంటారు. వారిపై ఎవరి కనుచూపు పడకుండా ఇలా దిష్టిచుక్కలు, నల్లతాడు కడతారు.

మన దేశంలో ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అనేది చూస్తే, యూపీలో ఇది ముందు ప్రారంభమైంది. ఇక్కడ బాబా భైరవనాథ్ ఆలయం నుంచి ఈ తాళ్లు కట్టించే సంస్కృతి ప్రారంభమైందని చెబుతారు. అయితే కొందరు ఇది దిష్టి కోసం అని చెబితే, మరికొందరు జీవితంలో పిల్లలకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బంది ఉండకుండా కడతారు అని చెబుతారు.

కొంత మంది పెద్దవారు కూడా కట్టుకుంటారు. వారికి కూడా ఆర్దిక సమస్యలు ఉంటే తొలగిపోవడానికి కట్టుకుంటారు. ఈ నలుపుకి చెడును లాగేసుకునే శక్తి ఉందని నమ్ముతారు. చీకటిలోనే చెడు శక్తులు ఉంటాయని నమ్ముతారు. అందుకే నిత్యం మన శరీరంపై ఈనల్ల తాడు ఉంటే ఎలాంటి భయాలు ఉండవని కొందరు చెప్పేమాట. అయితే నల్ల తాడు కట్టుకుంటే ఆ తాడుకి మరే రంగు తాడు పక్కన కట్టుకోవద్దు అంటున్నారు పెద్దలు. ఎందుకంటే ఆ శక్తి కోల్పోతుందని భావిస్తారు.