మెడిస‌న్స్ కోసం ఎలుకల మీద ప్రయోగాలు చేస్తారు ఎందుకో తెలుసా ?

Do you know why experiments are done on rats for medicine?

0
85

ఎలుక అంటే తెలియని వారు ఉండరు ఎందుకంటే ఇది ఇళ్లల్లోకి వచ్చి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఎలుకని చూసి పారిపోయేవారు చాలా మంది ఉంటారు. అంతలా పరుగులు పెట్టిస్తుంది మనల్ని. అయితే ధాన్యం పప్పులు కూరగాయలు ఇలా ఏదీ ఉంచదు అన్నింటిని నానశం చేస్తుంది. బట్టలు కొరికేస్తుంది సంచులకి రంధ్రాలు పెడుతుంది ఈ ఎలుక‌లు చేసే నష్టం అంతా ఇంతా కాదు. అయితే ఈ ఎలుకలు ఎక్కువ‌గా పంటలు నాశనం చేస్తాయి.

కాని మీరు గుర్తించారా? మందుల తయారీలో కాని ఏదైనా పరిశోధన‌ల్లో చూస్తే ఈ ఎలుకలపై పరిశోధనలు చేస్తారు. ఇలా ఎందుకు అని చాలా మందికి అనుమానం ఉంటుంది మరి అది ఎందుకో చూద్దాం.ఎలుకల DNA మానవుల DNA దాదాపు ఒకేలా ఉంటుంది. అందుకే మనుషులలో వచ్చే రోగాలను పసిగట్టడానికి మందులు కనిపెట్టేందుకు ఇలా ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్నారు.

మీకు తెలుసా మనలో చాలా మందికి డయాబెటిస్ తీవ్ర సమస్యగా ఉంది. అలాగే ఇలాంటి డయాబెటిస్ రోగాలు కొన్ని కొన్ని ఎలుకలకు ఉంటాయి. ఇక వీటిపై ప్రయోగాలు చేసినా పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఇవి పిల్లలను ఎక్కువగా కంటాయి దీని వల్ల ప్రయోగాలకు ఉపయోగమే. వీటిని ప్రయోగాల కోసం ఒక చోట నుంచి మరో చోటికి తీసుకువెళ్ల‌డం సులభం.