మీకు తెలుసా అసలు వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు

Do you know why Ganesha is immersed

0
100

వినాయక చవితి వచ్చింది అంటే ఎంత సరదా సందడి ఉంటుందో అందరికి తెలిసిందే. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ పూజ చేసుకుంటారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా ఆ గణపతి పూజలు చేస్తారు. వీధుల్లో విగ్రహాలు నృత్యాలు ఇలా ఒకటేమిటి ఆ గణపయ్య మండపాల దగ్గర ఎంతో ఆనందం కోలాహలం ఉంటుంది. అయితే నవరాత్రులు గణపతి పూజ చేసి స్వామిని నిమజ్జనం చేస్తారు. అయితే ఇలా ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా.

వినాయకునికి గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనకు గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం. ఇక మట్టితో వినాయకుడ్ని సిద్దం చేసి ఆ వినాయకుడ్ని పూజిస్తాం. ఇక చెరువులు కాలువల్లో మట్టి పూడుకుని ఉంటుంది దానిని తీసి బొమ్మని తయారు చేస్తాం. దీని వల్ల ఆ మట్టి పూడిక కూడా తీసిన‌ట్లు ఉంటుంది.

ఇలా నవరాత్రి ఉత్సవాలు అయ్యాక జల నిమజ్జనం చేస్తారు. దీని వెనుక పెద్దలు చెప్పేది ఏమిటి అంటే. ఎంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందే. ఇలా మట్టి విగ్రహాల్నీ పత్రిని నీటిలో నిమజ్జనం చెయ్యడం ద్వారా నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి. అందుకే ఇలా నిమజ్జనం చేస్తారు.