గరుడ పురాణం ఈ మాట మనలో చాలా మంది వినే ఉంటారు. ఇప్పుడు పిల్లలు పెద్దగా దీని గురించి తెలియకపోయినా 20 నుంచి 30 ఏళ్ల వారికి దీని గురించి తెలుసుకోవాలి అని ఆసక్తి ఉంటుంది. అయితే మనం సినిమాల్లో ఈ మాట విని ఉంటాం, కధల్లో కూడా విన్నాం. అయితే మీకు తెలుసా
మనిషి చనిపోయిన తర్వాత ఇంట్లో గరుడ పురాణం ఎందుకు చదువుతారో.
గరుడ పురాణాన్ని చాలా మంది మహాపురాణంగా చెబుతారు. మరణం తర్వాత పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్లుగా ఉంటుంది. ఇందులో నియమాలు, శ్లోకాలు, ధర్మం, యజ్ఞం, తపస్సు గురించి రహస్యాలు ప్రస్తావించారు. ఈ విషయాలు విష్ణువు- గరుడ పక్షికి వివరించారు.
కొంతమంది ఆత్మలు మరణించిన వెంటనే మరో శరీరాన్ని పొందుతాయని, కొన్ని ఆత్మలు ఇక్కడే ఉండి బాధపడతాయి అని మన పెద్దలు చెబుతారు. అది గరుడ పురాణంలో కూడా ఉంటుంది.
గరుడ పురాణం పారాయణం చేస్తే మరణించిన ఆత్మకు శాంతి లభిస్తుందని, దెయ్యంగా మారరు అంటారు. ఇక ఇందులో మొత్తం చదివితే మనం 19 వేల శ్లోకాలు ఉంటాయి. ఇది మనకు ధర్మ మార్గాన్ని తెలియచేస్తుంది.