ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

0
122

మిగతా రోజుల్లో గోరింటాకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా..ఆషాడంలో ప్రతి అమ్మాయి గోరింటాకు పెట్టుకుంటుంది. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా ఈ గోరింటాకు పని చేస్తుందట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

వాతావరణం ప్రకారం ఆషాడంలో వర్షాలు అధికంగా పడుతుంటాయి. దీంతో వతావరణం అంతా చల్లగా మారుతుంది. అంతేనా, సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి. అయితే, వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ, ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు. దీంతో సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది.

గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు. అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెబుతున్నారు కానీ, ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారట.