కృష్ణాష్టమి పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా

Do you know why Krishnashtami festival is celebrated?

0
109

శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అంటారు. శ్రీ కృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథి రోజున కంసుడి చెరసాలలో జన్మించాడు. ఈరోజు భక్తులు తెల్లవారుజామున నిద్ర లేచి, తలారా స్నానం ఆచరించి, మడిబట్టలు ధరించి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకుని పూజామందిరం సిద్దం చేసుకోవాలి.

ముగ్గులు అందంగా వేసుకోవాలి. అలంకరణలు చేసి పసుపు కుంకుమ గడపకి రాయాలి. ఇలా గుమ్మానికి తోరణాలు కట్టి స్వామిని కొలవాలి. ఇలాచేస్తే ఆ ఇంట ఆనందంతో పాటు సిరిసంపదలు శాంతి ఉంటాయి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి. తులసిమాల, సన్నజాజులతో మాల వేస్తే ఎంతో మంచిది.

అంతేకాదు కృష్ణాష్టమి రోజున ఒంటి పూట భోజనం చేసి, శ్రీకృష్ణునికి పూజ చేసి, శ్రీకృష్ణ దేవాలయాలు,మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఉట్టి కొట్టినా ఆ ఉట్టి కొట్టేవారిని చూసినా ఎంతో మంచిది. అలా ఇంట్లో చిన్నారులని కన్నయ్యలా తయారు చేసి ఎంతో మురిసిపోతూ ఉంటారు అమ్మలు.