మహిళలకు బొట్టు కాటుక తిలకం జడ ఇవన్నీ చాలా అందం. ముఖ్యంగా కాళ్లకు పట్టీలు చేతికి గాజులు ఇంకా అందం తీసుకువస్తాయి. ఇక ఆడపిల్ల అలంకరించుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే మహాలక్ష్మి అని అంటారు. అయితే బంగారం నగలు చాలా మంది ధరిస్తారు కాని కాలికి వచ్చేసరికి మాత్రం వెండి పట్టీలు మాత్రమే ధరిస్తారు.ఇలా బంగారు పట్టీలు కాకుండా వెండి పట్టీలు మాత్రమే ధరిస్తారు మరి ఎందుకు అనేది చూద్దాం.
బంగారం కంటే వెండి శరీరాన్ని వేడి నుంచి రక్షిస్తుంది. శరీరానికి చల్లదనం ఇస్తుంది ఇలా వెండి వస్తువులు ధరించడం వల్ల శరీరంలో ఉన్న వేడి బయటకు పోతుంది. ఇక బంగారపు పట్టీలు ధరించద్దు అనడానికి ఓ కారణం ఉంది. బంగారం అంటే లక్ష్మీదేవి అనే చెబుతారు. అలాగే లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే బంగారంతో చేసిన పట్టీలు ధరించరు. లక్ష్మీ దేవి రూపమని అవి కాలికి ఉండకూడదు అని చెబుతారు.
ఇలా కాళ్ల నొప్పులు ఉన్నా వెండి పట్టీల వల్ల తగ్గుతాయి. వేడి వల్ల చర్మం నల్లబడకుండా ఉండటం ఇవన్నీ కూడా వెండి వల్ల మంచిది అని పెట్టుకుంటారు. రక్తప్రసరణ సజావుగా జరగడానికి, పాదాలు వాపులు రాకుండా ఉండటానికి సహకరిస్తాయి. అందుకే ఇలా వెండిని మాత్రమే వాడటం జరుగుతూ ఉంది.