డెంగ్యూ ఫీవర్ వస్తే బొప్పాయి ఆకుల రసం తాగిస్తారు ఎందుకో తెలుసా

Do you know why you drink papaya leaf juice when we have dengue fever?

0
88

ఈ మధ్య మనం వింటున్నాం. డెంగ్యూ ఫీవర్ వస్తే వారికి బొప్పాయి ఆకుల రసం తాగమని చెబుతున్నారు. దీనిపై ఎన్నో వీడియోలు కూడా మనం చూస్తున్నాం. అయితే డెంగ్యూ ఫీవర్ దోమ కాటు వల్ల వస్తుంది.ఈ జ్వరం బారిన పడితే రక్తంలో ప్లేట్లేట్ల సంఖ్య తగ్గి ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. అందుకే వైద్యుల దగ్గరకు వెంటనే వెళతాం.

ఈ వ్యాధికి బొప్పాయి ఆకులతో చెక్ పెట్టవచ్చు. రెండు బొప్పాయి ఆకులను తీసుకొని ఆ ఆకులను బాగి పిండి రసం తీయండి. ఆ రసాన్ని నేరుగా తాగడం వల్ల డెంగ్యూ జ్వరం తగ్గుముఖం పడుతుంది. ప్లేట్లేట్ల సంఖ్య కూడా వేగంగా పెరుగుతుంది. అయితే తాగితే ఏమవుతుంది అనేది చూస్తే. బొప్పాయి ఆకుల్లో పపాయిన్, కీమోపపిన్ అనే ఎంజైములు ఉంటాయి. ఇవి ప్లేట్లేట్ల సంఖ్య పెంచడానికి తోడ్పడతాయి.

అంతే కాకుండా వీటిలో విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీనిని కచ్చితంగా తాగిస్తారు, ఒకవేళ మీరు టాబ్లెట్స్ వేసుకున్నా అవి కూడా ఈ బొబ్బాయి ఆకుల నుంచి తయారు చేసినవే. ఈ ఆకు రసం ఈజీగా చేసుకోవచ్చు. రెండు ఆకులు తీసుకుని ముక్కలు చేసి మిక్సీలో వేసి పేస్టులా చెయ్యండి. కొద్దిగా నీరు పోసుకోవచ్చు. ఫిల్టర్ చేసుకుని కొంచెం నీరు కలుపుకుని తాగండి.