భోజనం తర్వాత సోంపు ఎందుకు తింటారో తెలుసా?

0
109

మాములుగా సోంపు అంటే చాలా మంది ఇష్టపడతారు. మనలో చాలా మంది భోజనం చేసిన తర్వాత సొంపు తింటూ ఉంటారు. ఈ విధంగా సోంపు తినటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని మనందరి నమ్మకం. కానీ సోంపు అధికంగా తీసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

సోంపు గింజల్లో సెలీనియం, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్త ప్రసరణలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయి. సోపులో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తాయి. ఇది మన కంటి చూపును మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది.

సోంపు రెగ్యులర్ గా తీసుకోవటం వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. సోంపు గింజలను నమలడం వల్ల లాలాజలములో నైట్రైట్ శాతం పెరుగు తుంది. ఇది రక్తపోటుని సాధారణంగా ఉండేలా చూస్తుంది. సోంపు గింజల్లో పొటాషియం కూడా అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో నీటిని సమతుల్యతతో ఉండేలా చూస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

వీటిల్లో ఫైబర్ కంటెంట్‌ కూడా అధికంగానే ఉంటుంది. ఈ పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ విత్తనాల్లో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి..సోంపు ఎసెన్షియల్ ఆయిల్, ఫైబర్ శరీరం నుంచి మలినాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. దీని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.