పనస పండ్లు అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా. అందరికి ఈ పనస తొనలు ఇష్టమే. ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంత వరకూ చాలా చోట్ల పనస చెట్లు కనిపిస్తాయి. పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. అంతేకాదు పురుషులకి ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఇవి తింటే మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంగస్తంభన సమస్యల్ని తగ్గించి శృంగారంలో అధిక ఆనందం కలిగించేలా ఈ పనస చేస్తుంది. పనస శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పేగు సమస్యలు ఉన్నా తగ్గుతాయి. ఇందులో సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
పనస పండు షుగర్ వ్యాధి ఉన్నవారు మితంగా తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఇక జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇక పనస పొట్టు కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. కార్తీకంలో ఈ పనస పొట్టు ఆవపెట్టి కూర వండుకుంటారు. ఈ సీజన్ లో పనస వ్యాపారం మరింత ఎక్కువ జరుగుతుంది. అయితే వారానికి లేదా పదిరోజులకి ఓసారి తీసుకోవచ్చు పనస తొనలను. రోజూ తీసుకున్నా ఇది అనారోగ్యం అనేది మరువవద్దు.