మోచేతుల నలుపు త‌గ్గించే సింపుల్ చిట్కాలు మీకోసం..!

0
107

మనలో చాలామందికి శరీరమంతా తెల్లగా ఉండి మోచేతులు, మోకాళ్ల వద్ద నల్లగా ఉందని చింతిస్తుంటారు. నలుపుదనాన్ని తొలగించుకోవడం కోసం బ్యూటీ పార్లర్స్ కు వెళుతూ వివిధ రకాల క్రీమ్స్ వాడుతుంటారు. దానివల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అధికంగా ఉంటుంది. అందుకే ఈ సింపుల్ చిట్కాలు పాటించి మోచేతులు, మోకాళ్ల నలుపుదనాన్ని తొలగించుకోండి..

నిమ్మరసం నలుపుదనాన్ని తొలగించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. నిమ్మరసం తీసుకొని అందులో కాస్త రోజ్‌వాటర్ కలిపి అప్లై చేస్తే నలుపుదనం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టి మెరుగైన ఫలితాలు లభిస్తాయి. బేకింగ్ సోడ కూడా నలుపుదనాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాలో కాసిన్ని పాలు కలిపి కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మోకాళ్లు, మోచేతులపై అప్లై చేయాలి. ఇలా తరచు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.  కేవలం వారంరోజుల్లోనే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. కొబ్బరి నూనె రాయడం వల్ల కూడా శరీరంపై ఉండే నలుపుదనం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. స్నానం చేశాక కొబ్బరినూనెని మోచేతులు, మోకాలిపై రోజూ అప్లై చేస్తే క్రమక్రమంగా నలుపుదనం తగ్గుతుంది.