దగ్గు త్వరగా తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించాల్సిందే?

0
113

సాధారణంగా వేసవిలో వివిధ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న పలు రకాల సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబుతో ఏ కాలంలోనైనా బాధపడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దగ్గు, జలుబు తగ్గించుకోవడానికి  వివిధ రకాల మందులు వాడుతుంటారు. దానివల్ల శరీరంపై ప్రభావం పడే అవకాశం అధికంగా ఉంటుంది. అందుకే ఈ సింపల్ చిట్కాలు పాటించి దగ్గును తగ్గించుకోండిలా..

రసాయనాలు గల పానీయాలు తాగడం, దుమ్ము, ధూళి నుంచి వచ్చే కాలుష్యం కారణంగా ఈ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కావున 24 గంటలన్నా ఎక్కువగా దగ్గు ఉంటే  వైద్యులను సంప్రదించడం మంచిది.అంతేకాకుండా మిగితా వారితో భౌతిక దూరాన్ని పాటిస్తూ..మాస్క్ పెట్టుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలపి తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ చిట్కా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. పసుపులో ఆంటీ బాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గును తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి.