వేసవిలో ఐస్‏క్రీంను అధికంగా తింటున్నారా? అయితే ఈ నిజాలు తెలుసుకోండి

0
102

భానుడు నిప్పులు కుమ్మరిస్తున్నాడు. ఎండల నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది ఐస్ క్రీంను ఎంచుకుంటారు. ఎండలు అధికం అవుతుంటే ఐస్ క్రీం డిమాండ్ కూడా మరింత పెరుగుతుంది. ఐస్ క్రీం తినడం వల్ల అనేక లాభాలు చేకూరుతాయి. కానీ వేసవిలో ఇది అధికంగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడమే అంటున్నారు నిపుణులు. ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం..

ఐస్ క్రీంలో చక్కెర, కేలరీలు, కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజుకు రెండు మూడు ఐస్‌క్రీమ్‌లు తింటే 1000కి పైగా క్యాలరీలు శరీరంలోకి చేరి ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.దీని వల్ల బరువు కూడా పెరుగుతారు.

ఐస్‌క్రీమ్‌లో పరిమిత కొవ్వు ఉంటుంది . ఐస్ క్రీం తినడం వల్ల ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఎవరికైనా అధిక రక్తపోటు, అధిక బరువు ఉంటే రోజూ ఐస్‌క్రీం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికం. సంతృప్త కొవ్వు, చక్కెరతో కూడిన ఆహారం జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. కేవలం ఒక కప్పు ఐస్ క్రీం తినడం ద్వారా కూడా ఇది జరుగుతుంది.

ఐస్‌క్రీమ్‌లో చాలా షుగర్ ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు పరిమితంగా ఐస్ క్రీం తీసుకోవాలి. ఐస్‌క్రీమ్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఐస్ క్రీంలో కార్బ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో బొడ్డులో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి ఐస్ క్రీంను మితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.