లిప్‌స్టిక్‌ అధికంగా వాడుతున్నారా? అయితే మీకు ఈ సమస్యలు వచ్చినట్టే..

0
100

అందంగా తయారుకావాలని అందరు కోరుకుంటారు. ప్రస్తుత రోజుల్లో లిప్‌స్టిక్ వాడ‌కం ఏ స్థాయిలో పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు లిప్‌స్టిక్ లేనిదే బ‌య‌ట అడుగు కూడా పెట్టరు. కానీ ఇది వాడడం వల్ల చాలా దుష్ప్రలితాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

లిప్‌స్టిక్‌లో క్రోమియం, మెగ్నీషియం, లెడ్ , కాడ్మియం, పెట్రో కెమికల్స్‌ను వాడతారు. ఇన్ని కెమికల్స్ కలిసిన లిప్‌స్టిక్‌ను పెదాలకు పెడితే అవి శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. కాడ్మియం అనే కెమికల్ వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. లెడ్ కెమికల్ వల్ల మెదడు ఆరోగ్యం క్షిణిస్తుంది. అందం కోసం లిప్ కలర్ వేస్తే పునరుత్పత్తి సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.

లిప్‌స్టిక్‌లో ఉండే కెమికల్స్ క్యాన్సర్ బారిన పడేసే ప్రమాదం ఉంది. అంతేకాదు శారీర ఎదుగుదల కూడా ఆగిపోతుంది. శరీరంలో ఉండే అవయవాలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిప్‌స్టిక్‌లోని లెడ్ మెదడుపై తీవ్రంగా ప్రభావం చూపి తెలివితేటలను హరించేస్తుంది. ఇలా ఎన్నో దుష్ప్రలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.