పుచ్చకాయ ఫ్రిడ్జ్ లో పెట్టి తింటున్నారా? అయితే మీరు రిస్క్ లో పడ్డట్టే..

0
88

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ మనకు తెలియక చేసే తప్పుల వల్ల కూడా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ ఎండ నుండి ఉపశమనం పొందడానికి చాలామంది పుచ్చకాయను తింటుంటారు.

పుచ్చకాయ తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కానీ ఇవి తినేటప్పుడు చాలామంది ఓ చిన్న తప్పు చేస్తుంటారు. ఒకేసారి మార్కెట్లో రెండు, మూడు పుచ్చకాయలు కొని తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని, చల్లగా అయిన తరువాత తింటూ ఉంటారు. పుచ్చకాయలు ఫ్రిడ్జ్ లో పెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంటుంది.

ఎందుకంటే పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన దానిలో ఉండే పోషక విలువలు బాగా తగ్గిపోతాయి. దానివల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగకపోగా..నష్టాలు చేకూరే అవకాశం ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టిన పుచ్చకాయ తినడం వల్ల దగ్గు, జలుబు వచ్చే ప్రమాదం ఉండడంతో పాటు..ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.