సాధారణంగా మనం ప్రత్యేకించి సూర్యుని వైపు చూస్తే తుమ్ములు వస్తాయి. అయితే సూర్యుడిని చూసినప్పుడు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది. దీనికి కారణమేంటో..సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
శాస్త్రీయ భాషలో, దీనిని సన్ స్నీజింగ్అంటారట. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కి చెందిన హెడ్ అండ్ నెక్ సర్జన్, ప్రఖ్యాత నిపుణులు బెంజమిన్ బ్లెయిర్ ప్రకారం.. ఒక వ్యక్తి తలను ప్రకాశవంతమైన కాంతి తాకినప్పుడు తుమ్ములు వస్తుంటాయి. ఇది 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా జరుగుతుంది.
ఇలా తుమ్ములు రావడానికి కారణం ఏమిటనే దానిపై అనేక సిద్ధాంతాలు చెప్పారని డాక్టర్ బెంజమిన్ తెలిపారు. దీనికి సంబంధించి మొదటి సిద్ధాంతాన్ని గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ క్రీపూర్వం 350లో తెలిపారట. అరిస్టాటిల్ ప్రకారం.. సూర్యుని కిరాణాలలోని వేడి ముక్కు రంధ్రాల ద్వారా ప్రవేశించడంతో.. ముక్కులోని సెన్సిటీల్ పుటాలు స్పందించడం ద్వారా వ్యక్తులు తమ్ముతారట.
సూర్యడిని చూడగానే తుమ్ములు రావడానికి కాంతి తీవ్రతే ప్రధాన కారణమని చాలామంది తేల్చారు. ఒక నిర్ధిష్ట, అధిక తీవ్రతతో కూడిన కాంతిని చూసినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందట. ఆ కాంతి కారణంగా ముక్కు ఒక రకమైన అనుభూతి చెందడంతో తుమ్ములు వస్తాయట.
ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియదు.. ఇన్ని పరిశోధనలు జరిగినప్పటికీ.. సూర్యడికి, తుమ్ములు రావడానికి సంబంధించి ఖచ్చితమైన కారణాలు మాత్రం తెలియలేదు. అయితే, శాస్త్రవేత్త హెన్రీ ఎవెరెట్ అభిప్రాయాన్ని మాత్రం దాదాపు అందరూ అంగీకరించారు. డాక్టర్ హెన్నీ తన సిద్ధాంతాన్ని 1964లో వెల్లడించాడు. దీని ప్రకారం.. ఒక వ్యక్తి ఎండలోకి ప్రవేశించినప్పుడు వారి కళ్లపై బలమైన కాంతి పడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి కళ్లు సంకోచం చెందుతాయి. మెదడు సిగ్నల్స్ మోసే నాడీ కణాలు గందరగోళానికి గురవుతాయి. అలా తమ్ములు వస్తాయని హెన్నీ పేర్కొన్నారు.