ఆ వయసులోనూ శృంగార కోరికలు కలుగుతున్నాయా?

Do you still have sexual desires at that age?

0
88

స్త్రీ, పురుషుల్లో శృంగార కోరికలు కలగడం సర్వసాధారణం. కొందరు దంపతులు పెళ్లైన తర్వాత కొంత కాలానికి చాలా అరుదుగా సెక్స్​ చేస్తుంటారు. పిల్లలు పుట్టి, పెద్దవాళ్లు అవుతుంటే శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా స్త్రీలలో సెక్స్​పట్ల అనాసక్తి పెరిగిపోతుంది. దీనివల్ల కొంత మంది పురుషుల్లో కామవాంఛలు ఎక్కువైపోయి పక్కదారులు తొక్కుతుంటారు. వారిలో వయసు పెరిగేకొద్ది శృంగార కోరికలు ఎక్కువైపోతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది?. దీనికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

స్త్రీలలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గుముఖం కారణంగా శృంగారంపై ఆసక్తి చూపరు. కానీ పురుషుల్లో అలా కాదు. టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల పురుషుల్లో సెక్స్​ ప్రేరణ కలుగుతుంది. దాని ఉత్పత్తి పురుషుల్లో ఎప్పటికీ ఆగిపోదు. దీనివల్ల వయస్సు పెరిగినా మగవారిలో శృంగార వాంఛలు అలాగే ఉంటాయి. మంచి ఆహారం తీసుకోవడం, మానసికంగా ఉల్లాసంగా ఉండటం, వ్యాయామం చేయటం వల్ల శృంగార ప్రేరణలు ఎక్కువగా ఉంటాయి.

సెక్స్​లో పాల్గొనటం అనేది మానసిక స్థితిని బట్టే ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు శృంగారం పట్ల ఇష్టం తగ్గిపోతుంది. మోనోపాజ్​ తర్వాత సెక్స్​లో పాల్గొనడం అస్సలు ఇష్టం లేకుండా ఉంటారు. ఎందుకంటే వారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు పూర్తిగా పడిపోతాయి. అందుకే వారిలో మగవారితో పోలిస్తే శృంగార కోరికలు ఆడవారిలో అంతగా ఉండవు.