మహిళలను ప్రధానంగా వేధించే సమస్యల్లో చుండ్రు ఒకటి. వర్షాకాలంలో అధిక హ్యుమిడిటీ వల్ల చుండ్రు సమస్య పెరుగుతుంది. వాతావరణంలో కలిగే మార్పులు, శరీరంలో హార్మోన్ల స్థాయులు, ఆయిల్ ఫుడ్ వంటివి వీటికి కారణమవుతాయి. మరి దీనిని తగ్గించుకోడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
జుట్టు, ముఖం వంటివి చుండ్రు చేరి జిడ్డుగా మారాయంటే..దానికి కారణం సెబోరిక్ డర్మటైటిస్ అని చెబుతున్నారు వైద్యులు. శరీరంలో ఆయిల్, ఫంగస్ ఎక్కువ కావడం వల్ల డెడ్ స్కిన్ ఏర్పడి.. చుండ్రు వస్తుందని అంటున్నారు. దీనికి కొన్ని రకాల షాంపూలు, ఓరల్ ట్యాబ్లెట్లతో పరిష్కారం లభిస్తుందని వివరిస్తున్నారు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. ఆయిల్ ఫుడ్ తగ్గించుకోవాలి. వీటికి అదనంగా ఓవర్నైట్ యాంటీఫంగల్ లోషన్స్ ఉంటాయి. డాక్టర్ల సలహా మేరకు రోజువారీగా లేదా.. రోజువిడిచి రోజు వాడాల్సి ఉంటుంది. ఇంకా.. కోల్ థార్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్, జింక్ పైరిథ్రోన్ షాంపూలు చుండ్రును తగ్గిస్తాయి. వీటిని మాడుకు 5-10 నిమిషాల సేపు ఉంచి తలస్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది.