అన్నం తిన్న తర్వాత స్నానం చేస్తున్నారా? అయితే మీకు ప్రాణాపాయ సమస్యలు ఉన్నట్టే

0
128

చాలామంది తెలియక తిన్న తర్వాత స్నానం చేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో పెద్దలు ఎంత చెప్పిన వినకుండా అలాగే స్నానం చేస్తాము. కానీ వాళ్ళు చెప్పేది ఎంత వరకు వాస్తవమో మీరు కూడా ఒక్కసారి తెలుసుకుంటే మళ్ళి జీవితంలో అలా చేయరు.

భోజనం చేశాక వెంటనే  స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దానివల్ల ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగి హైపర్ థెర్మిక్ చర్య ఏర్పడుతుంది. దీని కారణంగా మనం కొంచెం ఆహారం తీసుకున్న జీర్ణం అవ్వడానికి  చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా  ఛాతీలో మంట, తిమ్మిర్లు, గుండెలో మంట సమస్యలు వేదించే అవకాశం కూడా ఉంది.

అందువల్లే తిన్నాక 2, 3 గంటలు ఆగిన తర్వాతే స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా మలబద్దకం సమస్య కూడా వేధించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉదర సంబంధ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా భోజనం చేసిన వెంటనే నడవకూడదు. దీనివల్ల ఆహారంలోని ధాతువులు, విటమిన్స్‌ ఆరోగ్యానికి సక్రమంగా లభించవు.