అల్లం అధికంగా తీసుకుంటున్నారా? అయితే మీ ప్రాణానికే ప్రమాదమట..

0
108

సాధారణంగా కూరల్లో రుచి, సువాసన కోసం అల్లాన్ని అధికంగా వేస్తుంటారు. దీనిని తినడం అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కానీ పరిమిత స్థాయిని మించి తింటే ప్రయోజనాలకంటే దుష్ఫలితాలే అధికంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో మీరు కూడా చూడండి..

శరీరానికి కావాల్సిన దానిక కన్నా ఎక్కువ అల్లం డయేరియా వచ్చే ప్రమాదం ఉండడంతో పాటు పలు రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఛాతీ నొప్పి, జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కూరల్లో అల్లం వీలయినంత తక్కువగా వేసుకోవడం మంచిది.

ముఖ్యంగా గర్భిణీ స్రీలు అధికంగా అల్లం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే గర్భిణీలు అల్లం తీసుకునే ముందు డాక్టర్లను సంప్రదించడం మంచిది. ఇంకా  బీపీ, షుగర్ పేషెంట్స్ దీనిని తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అధిక మోతాదులో అల్లం తీసుకోవడం వల్ల గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.