కాఫీ తాగేటప్పుడు ఈ ఆహారపదార్దాలు తీసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త..

0
125

సాధారణంగా కాఫీ అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఇష్టపడతారు. ఏ చిన్నసమస్య వచ్చి కాఫీ తాగితే రిలీఫ్ గా ఉంటుందనే ఉద్దేశ్యంతో అందరు దీన్ని తాగడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. కానీ కాఫీ అధికంగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటే..ఇంకా తాగేటప్పుడు ఈ ఆహారపదార్దాలు తీసుకుంటే మీరు సమస్యను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారంటున్నారు నిపుణులు. ఎందుకో మీరు కూడా చూడండి..

కాఫీ తాగేటప్పుడు ముందు ఎట్టి పరిస్థితుల్లో కాల్షియం ఆహార పదార్దాలు తీసుకోకూడదు. ఎందుకంటే సాధారణ కాఫీలోని కెఫిన్ కాల్షియం అధికంగా ఉండడం ఉండి దానికి తోడు కాల్షియం ఆహార పదార్దాలు తీసుకుంటే మూత్రంలో విసర్జించే కాల్షియం పెరిగి వివిధ రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగకపోవడం ఆరోగ్యానికి మంచిది.

అంతేకాకుండా కాఫీ తాగేటప్పుడు విటమిన్ ఆహార పదార్దాలను నివారించడం మంచిది. ఇంకా ఐరన్ ఆహారాలను కూడా ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ముఖ్యంగా వేయించిన పదార్దాలను, కాఫీ ఒకేసారి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. వేయించిన ఆహారాలలో చెడు కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల కాఫీ తాగినప్పుడు శరీరంలో అవి త్వరగా పేరుకుపోతాయి.