వంటకి సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా..అయితే ఈ సమస్యలు మీ దరి చేరవు!

0
85

వంటిట్లో వంట చేయాలంటే నూనె ఎంతో అవసరమో. అలాగే శ్రేష్టమైన నూనె వాడడం కూడా అంతే అవసరం. అయితే, సరైన కుకింగ్ ఆయిల్ చూజ్ చేసుకోవడం వల్ల హార్ట్ ఇంఫెక్షన్స్, కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ వంటి వాటి నుండి తప్పించుకోవచ్చు. అందుకే మనం వంటల్లో పొద్దుతిరుగుడు నూనెను ఎక్కువగా వాడడం మంచిది. నిజానికి పొద్దుతిరుగుడు నూనె వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అయితే  ఆ నూనెను ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెకు మంచిది:

పొద్దుతిరుగుడు నూనెని ఉపయోగించడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను నిర్ములిస్తుంది. అలానే చెడు కొలెస్ట్రాల్ డెవలప్ అవ్వకుండా కూడా చూసుకుంటుంది. కొలెస్ట్రాల్ లేకుండా సహాయం చేస్తుంది. కాబట్టి పొద్దుతిరుగుడు నూనె ఉపయోగించడం ఎంతో మేలు.

సామర్థ్యం పెంపు:

పొద్దు తిరుగుడు నూనెలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అలానే జుట్టుకి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. పొద్దుతిరుగుడు నూనె ఉపయోగించడం వల్ల సామర్థ్యం కూడా పెరుగుతుంది.

చర్మానికి మేలు చేస్తుంది:

పొద్దుతిరుగుడు నూనెలో విటమిన్ ఏ విటమిన్ ఈ ఉంటాయి. ఇది చర్మ సౌందర్యానికి ఎంతో  ఉపయోగపడుతుంది. ఈ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు గా పని చేస్తాయి. అలానే డామేజ్ అయిన స్కిన్ సెల్స్ కూడా బాగుంటాయి. ముడతలు పడకుండా కూడా చూస్తుంది. చర్మం పొడిబారిపోయినా కూడా మాయిశ్చర్ గా పని చేస్తుంది.

రోగ నిరోధక శక్తి పెంపు:

పొద్దుతిరుగుడు నూనె ఉపయోగించడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అలాగే  ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతుంది.  పొద్దుతిరుగుడు నూనెని ఉపోయోగించడం వల్ల ఇన్ని లాభాలను పొందొచ్చు.

పొద్దుతిరుగుడు నూనె వాడండి. అందరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి.