కూరగాయలను అలా కడుగుతున్నారా..అయితే జాగ్రత్త

Do you wash vegetables like that..but be careful

0
91

కరోనా వైరస్‌ రావడంతో ప్రతి ఒక్కరికీ చేతులు, కాళ్లను సబ్బు, ఇతర క్రీములతో శుభ్రంగా కడుక్కోవడం అలవాటైంది. ఈ అలవాటు వంటింటికి కూడా చేరింది. అంటే నిత్యం వంట కోసం తీసుకొచ్చే కూరగాయలతో పాటు పండ్లను కూడా చాలా మంది సబ్బుతో క్లీన్‌ చేస్తున్నారు.

కరోనా వంటి వైరస్‌లు, ఇతర సూక్ష్మక్రిములను దూరం చేసుకునేందుకు చాలా మంది రకరకాలుగా పండ్లు, కాయగూరలను శుభ్రం చేసుకుంటున్నారు. అయితే, పండ్లు, కూరగాయలను ఎలా శుభ్రం చేయాలి? దేనితో శుభ్రం చేయాలి? అనే అవగాహన లేదు. ఫలితంగా ఆరోగ్యం మాటేమో గానీ..అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.

కూరగాయలు, పండ్లను సబ్బు, డిటర్జెంట్లు, సర్ఫ్‌, డెటాల్‌, శానిటైజర్లు, ఇతరాత్ర క్లీనింగ్ వస్తువులతో శుభ్రం చేయాలనేది కేవలం అపోహ మాత్రమేనని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) వెల్లడించింది. ఇలా క్లీన్‌ చేయడం వల్ల వాటిని తిన్నప్పుడు మన పొట్టలోకి పోయి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయని ఎఫ్‌డీఏ హెచ్చరించింది.

మార్కెట్‌ నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను తెచ్చిన వెంటనే కుళాయి కింద పెట్టి మెల్లగా నీరు పోస్తూ కడగాలి. ఫలితంగా వీటిని పట్టుకుని ఉండే దుమ్ము, బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతాయి.ఆకుకూరలను పెద్ద పాత్రలో వేసి నీరు, ఉప్పు వేసి కాసేపు ఉంచితే పురుగులు ఉంటే బయటకు వస్తాయి. ఆకుకూరలను టవల్‌లో ఉంచి నీరు వెళ్లేలా చేయగలిగితే ఫ్రెష్‌గా ఉంటాయి.

పండ్లు, కూరగాయాలను చల్లటి నీటితో శుభ్రం చేయడం చాలా మంచిదని సెలవిస్తున్నారు ఉత్తర కరోలినా స్టేట్‌ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ బెన్‌ చాప్‌మ్యాన్‌. చల్లటి నీటి కింద కూరగాయాలను శుభ్రం చేయడం వల్ల ఇ.కొలై, సాల్మనెల్లా, లిస్టేరియా వంటి రోగకారకాలు 90 నుంచి 99 శాతం వరకు తొలిగిపోతాయని ఆయన చెప్పారు. దుస్తులను శుభ్రం చేయడానికి వినియోగించే సబ్బులను, డిటర్జెంట్లను కూరగాయలకు వాడితే మన పొట్టలోకి వెళ్లి జీర్ణసంబంధ సమస్యలు తెస్తాయని ఆయన హెచ్చరించారు.