కరోనా వైరస్ తో చాలా మంది కచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరీ ముఖ్యంగా బయటకు వస్తే మాస్క్ ధరిస్తున్నారు, ఇలా ఎవరైనా ధరించకపోతే జనమే ప్రశ్నిస్తున్నారు, ఇది మంచిదే సోషల్ డిస్టెన్స్ మాస్క్ ధరించడం రెండూ కూడా కచ్చితంగా పాటించాల్సిందే, అయితే ఈ మాస్క్ ఎంత వరకూ సేఫ్ అంటే, మంచి మాస్క్ లు వాడటం బెటర్ అంటున్నారు వైద్యులు నిపుణులు.
మాస్క్ల వాడకం కారణంగా కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగి, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని ప్రచారం జరుగుతుంది. దీని వల్ల కొందరు మాస్క్ పైకి పెట్టుకుంటున్నారు, అయితే దీనిపై వైద్యులు ఓ మాట అయితే చెబుతున్నారు.
ఎవరైతే సీపీఓడీతో బాధపడుతున్న వారు ఉన్నారో వారు అతిగా మాస్కులను ఉపయోగించడం వలన ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మాస్క్ ధరించడం వల్ల అతి తక్కువ మంది మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
బాగా ఊపిరితిత్తుల సమస్య ఉన్న వారికి ఇది ఇంకాస్త ఎక్కువగా ఉండవచ్చు. మాస్కులను బిగుతుగా ధరించడం వల్ల, వేగంగా నడవడం వల్ల శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే జనం లేకపోతే మాస్క్ తీసేయండి గుంపులు ఉన్న చోట జనం ఉన్న చోట మాస్క్ మాత్రంపెట్టుకోవాలి అంటున్నారు నిపుణులు…కనీసం రెండు పొరలతో కూడిన క్లోత్ మాస్క్లను వాడటం మంచిది, అలాగే శానిటైజర్ వాడాలి ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి.