మనం ప్లాస్టిక్ వస్తువులు తెగ వాడుతూ ఉంటాం, ఇవి వాడవద్దు అని ఎంత చెప్పినా బయటకు ఎలాంటి సంచి
తీసుకువెళ్లకుండా కవర్ కావాలి అని షాపు వారిని అడుగుతాం… ప్రభుత్వాలు భూమిలో కలవని ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పినా ఇంకా ఈ వాడం బాగా పెరిగింది… అయితే దీని వల్ల అనేక జంతువులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇక అనేకసార్లు ఆవులు గేదెలు ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులు తిని ఇబ్బంది పడటం చూశాం… అయితే సముద్రంలో ఉండే జీవులపై కూడా ఇది ప్రభావం చూపుతోంది.
ఓ చేప కడుపులో దాదాపు 10 కిలోల ప్లాస్టిక్ కవర్ల వ్యర్థాలు బయటపడ్డాయి. కర్ణాటకలోని అట్టావర్ లోని ఓ చేపల దుకాణంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఆ వ్యాపారి ఆ చేప కోస్తున్న సమయంలో అందులో ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్ధాలు బయటకు వచ్చాయి….అవి చూస్తే మొత్తం 10 కిలోల బరువు ఉన్నాయి.
వాస్తవానికి చేపలు ప్లాస్టిక్ తినవు, కాని మైక్రో ప్లాస్టిక్ లను చేపలు తెలియకుండా తినేస్తుంటాయి. అని వైద్యులు చెబుతున్నారు ఈ చేప కూడా ఇలా తిని ఉంటుంది అని తెలియచేశారు… మొత్తానికి ఎంత ప్లాస్టిక్ మన సముద్రంలో కలుస్తుందో ఈ ఘటనతో అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు జంతు ప్రేమికులు.
ReplyForward
|