తస్మాత్ జాగ్రత్త-చికెన్ బిర్యానీ అధికంగా తింటున్నారా?

Does eating chicken biryani cause heart attack

0
85

చికెన్ బిర్యానీ తింటే హార్ట్ ఎటాక్ వస్తుందా..ఈ ప్రశ్నకు డాక్టర్లు అవుననే సమాధానం చెబుతున్నారు. బిర్యానీ ఎంత తింటున్నారు. ఎన్నిసార్లు తింటున్నారనేది కూడా ముఖ్యం అని డాక్టర్లు అంటున్నారు. కొంచెం పరిమాణంలో బిర్యానీ తింటే..మీ ఆరోగ్యానికి నో ప్రాబ్లమ్. కానీ రుచికరంగా ఉంది కదా అని కిలోల కొద్ది బిర్యానీ లాగిస్తే మాత్రం ఇక అంతే సంగతులు.

ఇంట్లో చేసిన బిర్యానీ అయితే చాలా సేఫ్. లేదంటే ఏదైనా మంచి రెస్టారెంట్‌లో తాజా, నాణ్యమైన పదార్థాలతో చేసిన బిర్యానీ కూడా మంచిదే. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు సమతుల్యంగా ఉండాలి. అలా కాకుండా మరి ఎక్కువ బిర్యానీ తింటే అది గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. తాజా కూరగాయలు, పండ్లు, ఇతర పోషకాలు మన ఆహారంలో ఉండడం చాలా ముఖ్యం.

ముఖ్యంగా మాంసాహారంలో చేప చాలా మంచిది. అందులో ఒమెగా 3 ఫ్యాట్స్ ఉండడం వల్ల అవి గుండెకు చాలా మేలు చేస్తాయి. చికెన్ కూడా ఓకే. కానీ మటన్, బీఫ్, పోర్క్ వీటిలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. మటన్ లేదా బీఫ్ ఎక్కువగా తీసుకుంటే మనకు గుండె సంబంధిత సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు.