ఎవరికి అయినా దెబ్బ తగిలిని ఏదైనా పుండు వచ్చినా వారు శనగపప్పు పల్లీలు శనగపిండి పదార్దాలు తీసుకోవద్దు అని చాలా మంది పెద్దలు చెబుతారు, ఇలా తింటే శరీరంలో ఆ భాగం దగ్గర చీము పడుతుంది అని చెబుతారు, అయితే ఇది నిజమా అనేది వైద్యులు సీనియర్ డాక్టర్లని అడిగితే వారు చెప్పిన సమాధానం ఏమిటి అంటే.
పప్పు తింటే చీము పడుతుందనేది సమాజంలో ఉన్న ఓ పెద్ద మూఢనమ్మకం. నిజానికి గాయం తగిలితే అది తొందరగా మానాలంటే పప్పు తినడం మంచిది, కాని చదువుకున్న వారు కూడా ఇది ఆలోచించకుండా పప్పు తినడం మానేస్తారు.
మీకు గాయాలు అయిన సమయంలో మంచి డాక్టర్ ని అడగండి వారే చెబుతారు, పప్పు తింటే ఏమీ కాదు అని, బాగా ఉడికించిన పప్పు తింటే గాయమయినా చీము పట్టదు, అంతేకాదు ఆ పుండు తొందరగా మాని పోతుంది అంటున్నారు వైద్యులు.