పాలకూర తింటే కిడ్నీల్లో రాళ్ళు వస్తాయా?

Does eating lettuce cause kidney stones?

0
115

మనదేశంలో అనేక రకాల ఆకుకూరలు సమృద్ధిగా పండుతాయి. గోంగూర, పాలకూర, తోటకూర, బచ్చలికూర, మెంతికూర, పుదీనా..ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదిగానే ఉంటుంది. ఆరోగ్యాన్ని అందించే ఆకుకూరలు తినాలని ఎవరికైనా ఉంటుంది. కానీ వాటిని కట్ చేసి వండుకోవడం అంటే చాలా మంది పెద్ద టాస్క్‌లాగా ఫీలైపోతుంటారు.

ఒక కూరకు కమ్మటి రుచి రావాలంటే వాటిని కట్ చేయడంలోనూ టెక్నిక్ ఉంటుంది. ముఖ్యంగా ఆకుకూరల విషయంలో ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. మీకు ఇష్టమైన పాస్తా లాంటి ఆహారాన్ని వండుకునే సమయంలో అందులో వాడే ఆకుకూరల పొరలు, వాటి కాడలు మంచి సువాసనతో పాటు మంచి రుచిని అందిస్తాయి. అయితే ఆకుకూరలు ఎలా కట్ చేయాలో తెలియక తికమకపడుతుంటారు. ఇలాంటి వారి కోసం ప్రముఖ చెఫ్‌లు సులభమైన టెక్నిక్‌ను చెప్తున్నారు.

ముఖ్యంగా ఆకుకూరలను తరిగేటప్పుడు ముందుగా ఆకులను శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. అనంతరం వాటిని ఆరబెట్టాలి. ఆ తర్వాత ఆకు మీద ఆకును పేర్చుకుని వాటిని మడతబెట్టి పదునుగా ఉండే కత్తితో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఆకుకూరలు అందంగా కనిపించడమే కాకుండా మంచి రుచిని అందిస్తాయి. అలాంటి ఆకుకూరలు తిన్నప్పుడు మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

ఆకుకూరల గురించి చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూర తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయని అంటుంటారు. నిజానికి పాలకూర తింటే కిడ్నీలో రాళ్లు రావు. కానీ రాళ్లు వచ్చే అవకాశం ఉన్నవారిలో ఒక్సాలేట్స్‌ వల్ల రాళ్లు ఏర్పడవచ్చు. సరైన మోతాదులో నీటి పదార్థాలు తీసుకోనివారు, ఎక్కువగా ఎండలో తిరిగే వారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. ఇలాంటివారు వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగాలి. ఆకుకూరలు వండేటప్పుడు నీళ్లు పోయవద్దు. అందులో ఉన్న నీటితోనే కూర మగ్గుతుంది. ఇలా వండుకున్న ఆకుకూరల్లో అన్ని పోషకాలు ఉంటాయి. ఉడికించి నీళ్లు పారబోస్తే చాలా విటమిన్లు పోతాయి. తద్వారా మన శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు.