జుట్టు రాలడం తగ్గడం లేదా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే…!

0
97

అందంగా కనబడాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందంగా పెంచడంలో కేవలం చర్మసౌందర్యమే కాకుండా జుట్టు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుతకాలంలో చాలా మంది వివిధ రకాల జుట్టు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిలో ముఖ్యంగా జుట్టురాలడం పెద్ద సమస్యగా మారింది.

దాంతో జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండ‌డానికి వివిధ రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. అలంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. గుడ్లలో ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉండి ఎలాంటి జుట్టు సమస్యలకైనా చెక్ పెడుతుంది.

ఒక గుడ్డు పగలగొట్టి, ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ మరియు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెతో కలపండి. ఆ తరువాత దానిని తలపై రుద్ది 20-30 నిమిషాలు నానబెట్టి తేలికపాటి షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోండి. ఉల్లిపాయ రసం జుట్టు గట్టిపడటానికి బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనె మరియు పెరుగును ఉల్లిపాయ రసంతో కలిపి జుట్టుకు పెట్టుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది.