శృంగారంలో పాల్గొంటే మొటిమలు రావడం తగ్గుతాయా?

Does having sex reduce the appearance of pimples?

0
96

యవ్వనంలో మొటిమలు రావడం సహజం. వీటిని పొగొట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు​ చాలా వరకు ఫలించవు. ఈ మొటిమల సమస్యకు శృంగారమే పరిష్కారమా..మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

శృంగారంలో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడి తగ్గడం సహా ఎన్నో లాభాలు ఉంటాయంటారు. ముఖంపై మొటిమలతో బాధపడుతున్నవారిలో పలువురు. ఈ సమస్యకు శృంగారం ఒక మంచి పరిష్కారమని భావిస్తుంటారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. సెక్స్​లో పాల్గొంటే మొటిమలు తగ్గిపోవని..శృంగారానికి, మొటిమలు తగ్గడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

మొటిమలు రావడానికి కారణం యాండ్రోజెన్స్ ఎక్కువ ఉండటమని నిపుణులు చెప్పుకొచ్చారు. యాండ్రోజెన్స్​ అనే ఈ సెక్స్ హార్మోన్స్​ మగవారిలోను, ఆడవారిలోనూ కూడా వస్తుంటాయని..ముఖ్యంగా యుక్త వయస్సు వచ్చిన వారు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటారని తెలిపారు. ఈ సమస్యకు అవసరం బట్టీ మందులు వాడితే తగ్గిపోతుందని స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం సెక్స్​లో పాల్గొనాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

శృంగారం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. సెక్స్​ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తెలివితేటలు కూడా పెరుగుతాయట. మెదడులో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సెక్స్​లో పాల్గొనడం వల్ల బ్రెయిన్​కు ఆక్సిజన్​ ఎక్కువగా చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.