ఊరగాయ పచ్చళ్ల(Pickles) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని తల్చుకుంటేనే నోరూరిపోతుంది. ఈ ఊరగాయాలు భారతదేశమంతా ఫేమస్. దాదాపు ప్రతి ఇంటిలో కూడా ఊరగాయ జాడీలు తప్పకుండా ఉంటాయి. ఆఖరికి గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లేటప్పుడు కానీ.. విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వీటిని తీసుకెళ్లి అక్కడ ఆరగిస్తారు. అన్నంలోకైనా దేనిలోకైనా ఊరగాయ ఉంటే ఆ టేస్టే వేరు. భారత ప్రజల మనసులకు ఇంత చేరువైన ఊరగాయ పచ్చళ్లతో మన ఆరోగ్యానికి ఎన్నో దుష్ఫ్రభావాలు ఉన్నాయంటే నమ్ముతారా. మా తాతల కాలం నుంచి తింటున్నారు.. వాళ్లు 90 ఏళ్లకు కూడా 20 ఏళ్ల కుర్రాడిగానే ఉన్నారు అని కొట్టిపారేస్తారు. కానీ నిజంగా ఊరగాయ పచ్చళ్లు తినడం అనేది మన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు, పోషకారా నిపుణులు ఘంటాపథంగా చెప్తున్నారు. దీని వల్లే వచ్చే ఆరోగ్య సమస్యలు చిన్నాచితవి కూడా కాదని, ఇవి మన రోజువారీ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వారు అంటున్నారు. మరి ఇంతకీ అసలు నోరూరించే ఊరగాయలతో ఉన్న దుష్ప్రభావాలేంటో ఒకసారి తెలుసుకుందాం..
ఊరగాయాల్లో ఉండే ఒకేఒక ఆమ్లం మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అదే లాక్టిక్ యాసిడ్. మన శరీరానికి అవసరమైనప్పుడు ఇది ఒక శక్తి వనరుగా పనిచేస్తుంది. కానీ ఇది మితిమీరితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది అధికమైతే మన శరీరంలో ఆక్సిడోసిస్ అనే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కాస్తా బలహీనత, వాంతులు, నోప్పిని కలిగిస్తుంది.
హైబీపీ: శరీరంలో లాక్టిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల రక్తపోటు సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు ఏర్పడి.. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా ఆక్సిడోసిస్ కారణంగా వాంతులు, వికారం కలిగి రోజంతా అసౌకర్యంగా గడుస్తుంది.
కండరాల బలహీనత: లాక్టిక్ యాసిడ్ మన కండాలలో దృఢత్వాన్ని పెంచుతుంది. దాంతో పాటుగా కండరాల నొప్పిని కూడా అధికం చేస్తుంది. నొప్పి కారణంగా కండరాలు బలహీనమై మన రోజువారీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అజీర్ణం: వీటన్నింటితో పాటు లాక్టిక్ యాసిడ్ స్థాయిలు అధికం కావడం వల్ల అజీర్ణ సమస్య కూడా వస్తుంది. మలబద్దకం కూడా ఏర్పడుతుంది. Pickles వల్ల కడుపులో ఎసిడిటీ, నొప్పి కూడా వస్తాయి.
గుండె జబ్బులు: అంతేకాకుండా ఆక్సిడోసిస్ కారణంగా నోరు పొడిబారడం అధికమవుతుంది. దీని వల్ల తినడం, తాగడంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో పాటుగానే అధిక లాక్టిక్ యాసిడ్ వల్ల ఛాతీనొప్పి, హార్ట్ బీట్‌లో అవకతవకలు ఏర్పడి గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
బలహీనమైన ఎముకలు: లాక్టిక్ యాసిడ్ ఎముకల స్థితిని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. ఎముకల బలహీనతకు దారి తీస్తుంది. ఇది మన రోజువారీ జీవితంలో ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో ఉష్ణోగ్రతలను కూడా అటూఇటూ చేస్తుందని చెప్తున్నారు.