కోడిగుడ్లు ఉడకపెడుతుంటే పగులుతున్నాయా? అయితే ఈ టిప్స్ పాటించండి..

0
106

కోడిగుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలుసు. అందుకే మనకు ఏ చిన్న సమస్య వచ్చిన కోడిగుడ్లు తీసుకోమని వైద్యులు సూచించారు. ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. అందుకే రోజుకు కనీసం ఒక్క కోడిగుడైన ఉడకపెట్టుకొని తినడం మంచిది. కానీ ప్రస్తుత రోజుల్లో ఉడకపెడుతుంటే కోడిగుడ్లు పగలడం పెద్ద సమస్యగా మారింది.

దానివల్ల సొన గిన్నెకు అంటుకొని ఒక రకమైన దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. కానీ అల జరగకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ముందుగా గిన్నెలో గుడ్డు మొత్తం మునిగేలా నీళ్లు పోయాలి. ఒకదానికొకటి తగలకుండా జాగ్రత్త పడాలి. ముందే గుడ్లను నీళ్లలో వేసిన దానికంటే నీళ్ళు మరిగేటప్పుడు గుడ్లు వేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రెండు నిమిషాలు ఆగిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి.

ఇక మరో 15 నిమిషాలు ఉడికిన తర్వాత గిన్నెను దించాలి. ఆ తర్వాత ఉడకబెట్టిన గుడ్లను చల్లని నీటిలో వేయడం వల్ల పైపెంకు సులభంగా వస్తుంది. గుడ్లు పగిలిపోకుండా ఉండాలంటే వైట్ వెనిగర్ కలపాలి. ఇలా చేస్తే గుడ్లు పగిలిపోకుండా చక్కగా ఉడుకుతాయి. ఇలాంటి పద్ధతుల్ని మీరు కూడా అనుసరించి మంచి ఫలితాలు పొందండి.